![]() |
![]() |

నిన్న మొన్నటి దాకా సింపుల్ గా ఉంటూ అందరికి ట్రెడిషనల్ లుక్ లో కన్పించిన ఆరోహి రావు.. డోస్ పెంచింది. అందచందాలతో మరో అడుగు ముందుకేసింది. బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేయడమే కాకుండా బోల్డ్ కంటెంట్ రాసుకొచ్చింది. "బి ఏ బ్యాడ్ బిచ్ అండ్ ఏ గుడ్ పర్సన్.. ఇట్స్ ఓకే టు బి బోత్ " అని క్యాప్షన్ రాసింది. ఈ పోస్ట్ లో మొత్తంగా ఆరు ఫోటోలు పోస్ట్ చేసింది ఆరోహి. అందులో మొదటి, మూడు ఫోటోలలో మరీ ఎక్కువగా బోల్డ్ గా కన్పించేసరికి నెటిజన్లు ఆ ఫోటోల గురించి మాత్రమే కామెంట్ చేస్తున్నారు. ఇక నేను అందాలు ఆరబోస్తానంటు మస్త్ మస్త్ ఫోటోలని పోస్ట్ చేసేసింది ఈ బ్యూటీ.
ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమైంది. బిగ్ బాస్ హౌస్ లో సూర్యతో కలిసి ఎక్కువ సమయం గడిపిన ఈ భామ.. ఇనయా సుల్తానా, కీర్తభట్ లతో మొదట్లో మంచి స్నేహాన్ని కలిగి ఉండేది. అయితే సూర్యతో స్నేహం మొదలయ్యాక అందరిని పక్కన పెట్టేసి సూర్య ఎక్కడుంటే అక్కడ టైమ్ గడిపేది. ఆ రకంగా హౌస్ లో ఎంతో కొంత గుర్తింపు పొందింది ఆరోహి రావు.
బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదాగా గడిపింది.
![]() |
![]() |